📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఉదయగిరి నారా చంద్రబాబు నాయుడు మహాసభకు కాశినాయన మండలం నుండి భారీగా తరలివెళ్లిన తెలుగుదేశం శ్రేణులు

ఉదయగిరి నారా చంద్రబాబు నాయుడు మహాసభకు కాశినాయన మండలం నుండి భారీగా తరలివెళ్లిన తెలుగుదేశం శ్రేణులు

📰 Generate e-Paper Clip

కడప/కాశినాయన సెప్టెంబర్ 30ప్రజావాణి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించనున్న మహాసభకు విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లాలో పార్టీ శ్రేణులు భారీగా కదిలాయి. బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి (సూర్యనారాయణ రెడ్డి) మరియు కాశినాయన మండలం ముఖ్య నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాశినాయన మండలం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఉదయగిరి సభకు తరలివెళ్లారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా నియోజకవర్గ ఇన్చార్జి పిలుపు మేరకు కాశినాయన మండలం నుండి వందలాది వాహనాల్లో పార్టీ క్యాడర్ తరలిరావడంతో కాశినాయన మండల కేంద్రంలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది.అడుగడుగునా ఉత్సాహం.పసుపుమయమైన రహదారులు,కాశినాయన మండలం నుంచి బయలుదేరిన ఈ భారీ కాన్వాయ్‌ను నాయకులు జెండాలు ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నాటి వెంకటరెడ్డి మాట్లాడుతూ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని, ఆయన విజన్‌కు మద్దతుగా నిలిచేందుకు కాశినాయన మండల ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారని పేర్కొన్నారు. బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డి  దిశా నిర్దేశంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తున్నామని, ఈ మహాసభ ద్వారా కూటమి ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాశినాయన మండలానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, వివిధ విభాగాల ప్రతినిధులు, తెలుగు యువత, తెలుగు మహిళా విభాగం నాయకురాళ్లు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. “చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి”, “తెలుగుదేశం పార్టీ జిందాబాద్” అనే నినాదాలతో ఉదయగిరి వెళ్లే రహదారులన్నీ మారుమోగాయి. కార్యకర్తల్లో ఈ పర్యటన సరికొత్త జోష్ నింపిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.