📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

*మన ప్రజావాణి*
మంచిర్యాల సెప్టెంబర్ 29

జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి పట్టణంలోని కె.ఆర్‌. గార్డెన్స్‌లో మందమర్రి తహసిల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, సిబ్బందితో కలిసి ఎఈఆర్‌ఓలు, బిఎల్‌ఓలు, బిఎల్‌ఓ సూపర్‌వైజర్లకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్, అనామోలీస్ సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని, నోటీసులు జారీ అయిన ఓటర్లు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా వారి ఓటు హక్కును ధ్రువీకరించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లు సమర్పించిన ధ్రువపత్రాల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దశను నిబంధనల ప్రకారం, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఎఈఆర్‌ఓలు, బిఎల్‌ఓలు, బిఎల్‌ఓ సూపర్‌వైజర్లు సమన్వయంతో పని చేయాలని, పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.