📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriయువతి యువకులు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

యువతి యువకులు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

📰 Generate e-Paper Clip

*యువతి యువకులు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి…*

*గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించిన ఉత్తమ వైద్యశ్రీ చింతకింది మురారి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 29*

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రపంచ గుండె భద్రత వారోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ ఈసీ మెంబర్ , ఉత్తమ వైద్యశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మురారి మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో , మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుండె భద్రత కోసం ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. గుండె ఆరోగ్యానికి సూచనలు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. సమతుల , పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ , నూనె , ఉప్పు , చక్కెర పదార్థాలను తగ్గించాలి. ధూమ పానం , మద్య పానం, గుట్కా వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ , వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ఛాతీ నొప్పి , ఎడమ భుజంలో నొప్పి , ఆయాసం , చెమటలు పట్టడం వంటి గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయ కుండా వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. మారు తున్న కాలంలో 30 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి గుండె పరీక్షలు చేయించు కోవడం ఉత్తమమని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.