📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం ఏఐఎస్ఎఫ్

విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం ఏఐఎస్ఎఫ్

📰 Generate e-Paper Clip

విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం ఏఐఎస్ఎఫ్

హనుమకొండలో 90వ వార్షికోత్సవాల సందర్భంగా రెండో రోజు కార్యక్రమాలు

*భూపాలపల్లి సెప్టెంబర్ 29 మన ప్రజావాణి* : విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతమే లక్ష్యంగా ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని ఏఐఎస్ఎఫ్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ అన్నారు. హనుమకొండ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలని నేరెళ్ల జోసఫ్ డిమాండ్ చేశారు.విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో విడుదల చేయాలని, ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.