విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం ఏఐఎస్ఎఫ్
విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం ఏఐఎస్ఎఫ్ హనుమకొండలో 90వ వార్షికోత్సవాల సందర్భంగా రెండో రోజు కార్యక్రమాలు *భూపాలపల్లి సెప్టెంబర్ 29 మన ప్రజావాణి* : విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతమే లక్ష్యంగా ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని ఏఐఎస్ఎఫ్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ అన్నారు. హనుమకొండ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ...