📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకుసుమ విత్తనాల పంపిణీ

కుసుమ విత్తనాల పంపిణీ

📰 Generate e-Paper Clip

*కుసుమ విత్తనాల పంపిణీ*

* *చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య*

ప్రజా వాణి,న్యూస్ వికారాబాద్ జిల్లా
కుసుమ పంట సాగు చేసుకునే రైతులకు సోమవారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు.వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలంలోని రైతు వేదికల క్లస్టర్ల రైతులు కుసుమ విత్తనాలను తీసుకెళ్లారు. ఎకరానికి నాలుగు కిలో బస్తా విత్తనాల ప్యాకెట్లు రైతులకు అందజేశారు. ఎకరాలకు మించి కుసుమ విత్తనాల ప్యాకెట్లు ఇవ్వడం లేదన్నారు.ఆసక్తిగల రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్ జిరాక్స్ కాఫీతో రైతు వేదికకు ముందు రాపిచుకున్న రైతు లకు ఉచితంగా విత్తనాలను ఇవ్వనున్నట్లు ఏవో జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.మండలానికి 17 క్వింటాలా కుసుమ లు వచ్చాయి ఎకరాకు 4 కిలోల బస్తా ఇవ్వడం జరుగుతుందని అన్నారు.కుసుమ సాగులో అధిక సాంద్రత పద్ధతి, సింగిల్ పీకింగ్ అనేది తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే సరికొత్త విప్లవాత్మక విధానం వ్యవసాయ రంగంలో వచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక సర్పంచి నరసింహారెడ్డి, సొసైటీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి, సర్పంచులు జగన్ రెడ్డి, శేఖర్, సంతోష్ రెడ్డి, సామెల్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ప్రకాశం, నాగిరెడ్డి, ఖదీర్,నరసింహారెడ్డి, పరమేశ్వర్, రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)లు లక్ష్మి, ఆదిల్, పవన్, లోకేశ్వర్, రాజు, వివిధ పార్టీల నాయకులు అందే సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.