ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ ఫర్హాన్ (13) బాలాజీనగర్‌లోని మొహమ్మదీయ మసీదులో ఉంటూ ఖురాన్, ఉర్దూ నేర్చుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న ఉదయం 7 గంటల సమయంలో మసీదు నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బాలుడి ఎత్తు సుమారు 4 అడుగులు, సాధారణ ఛాయతో ఉంటాడని, తెలుపు-నలుపు రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలుడు హిందీ, బెంగాలీ భాషలు మాట్లాడతాడని పేర్కొన్నారు.
బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్: 8712662705, సెక్టార్ ఎస్‌ఐ: 8712662184 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
