📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamమన ప్రజావాణి ప్రత్యేక కథనానికి స్పందన..!

మన ప్రజావాణి ప్రత్యేక కథనానికి స్పందన..!

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి ప్రత్యేక కథనానికి స్పందన..!

ఖమ్మం ప్రజావాణి గ్రీవెన్స్ లో ముదిగొండ మల్లారం జిపిఓపై ఫిర్యాదు…

విచారణకు ఆదేశించిన అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ..?

మన ప్రజావాణి ప్రత్యేక కథనం…3

ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం మల్లారం జి పి ఓ ఫై నిర్లక్ష్య విధులపై మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో వరుస కథనాలతో స్పందనగా స్పందించిన కొందరు జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ అందిన దరఖాస్తు మేరకు విచారణ చేయాలని సంబంధిత జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా గత రెండు రోజులుగా మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో వార్తా కథనాలను బాధితులు జిల్లా అదనపు కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులకు అందజేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను సక్రమంగా పొందేందుకు జిల్లా యంత్రాంగం పనిచేయాల్సి ఉండగా చింతకాని ముదిగొండ మండలం కు చెందిన కొందరు రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు విరుద్ధంగా ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ముదిగొండ మండలం మల్లారం జిపిఓ విజేత ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా వైరా లో రేషన్ కార్డు కలిగి ఇటీవల బియ్యం తీసుకున్నట్లు ప్రజావాణి వార్త కథనానికి జిల్లా డివిజనల్ మండల స్థాయి అధికారులు విచారణ చేసినట్లు సమాచారం. కాగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం రెండవ ఇన్స్పెక్టర్ ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దరఖాస్తుదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ డివిజనల్ రెవిన్యూ అధికారులు స్పందించి శాఖపరమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ముదిగొండ చింతకాని మండలాల ప్రజలు కోరుతున్నారు.

*లెక్కకు మించి భూములు ఉన్న పేదలుగా కాసులకు కక్కుర్తి పడి ధృవీకరణలు అందించిన వ్యవహారంపై సమగ్ర ఆధారాలతో రేపటి కథనం…4లో

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.