📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు తగవు

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు తగవు

📰 Generate e-Paper Clip

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు తగవు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పరిగిలో నిరసన
TUWJ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మౌన ర్యాలీ
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత.. బహిరంగ క్షమాపణకు డిమాండ్

పరిగి,సెప్టెంబర్ 28(ప్రజావాణి):

జర్నలిస్టులు, వారి సంక్షేమ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) పరిగి డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పట్టణంలో జర్నలిస్టులు వినూత్నంగా మౌన ప్రదర్శన నిర్వహించారు.
ప్లకార్డులు చేతబూని స్థానిక బస్టాండ్ ప్రాంగణం నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా నిలుస్తూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విలేకరుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రజాప్రతినిధి మాట్లాడటం శోచనీయమన్నారు. బహుజన జర్నలిస్టులను, వారి హక్కుల కోసం పోరాడే సంఘాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని మండిపడ్డారు.
ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే, నియోజకవర్గవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, బహుజన జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.