వన్ టౌన్ నూతన సి.ఐ. కరుణాకర్ ను కలిసిన ప్రజాబలం సంఘం నాయకులు
అనంతపురం ప్రజావాణి సెప్టెంబర్ 26,ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్ ప్రజాబలం సంఘం నాయకులు నాయకురాలు శ్రేణులతో మర్యాదపూర్వకంగా కలిసి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజాబలం సంఘం నాయకులు నాయకురాలు సీఐను కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాబలం సంఘం అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పద్మశాలి కళ్యాణి తాడిపత్రి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు బాలచంద్ర పామిడి మండల అధ్యక్షులు సభావత్ గోవిందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

