*కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు*
,*సమగ్ర ప్రజావాణి మల్యాల ముత్యంపేట కొండగట్టు*, సెప్టెంబర్ 26:
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి.
చివరి రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. యాగశాలలో వేద పండితులు మూలమంత్ర హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు.
అనంతరం యాగశాల నుండి ఆలయం వరకు పవిత్రాలతో శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారికి పట్టు పవిత్రాల అలంకరణ, కుంభప్రోక్షణ, పవిత్ర సమర్పణ కార్యక్రమాలను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనంతో ఉత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*- సమగ్ర ప్రజావాణి న్యూస్, కొండగట్టు*

