*మంచాలలో అడ్డదిడ్డంగా కరెంటు కోతలు….* రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 26 ( ప్రజావాణి): అడ్డదిడ్డంగా అమలవుతున్న కరెంటు కోతలు రైతంగనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని. విద్యుత్ సరఫరాతో రైతులు కంటికి రెప్పలా కాపాడుతున్న వరి పైరు కళ్ల ముందే ఎండిపోవడంతో ఆవేదన ఆగ్రహంగా మారుతుంది. మంచాల గ్రామంలో
కళ్ల ముందే ఎండుతున్న పంటలు..
గ్రేటర్ లో పెరుగుతున్న వినియోగభారం.
గ్రేటర్ లో 85 మిలియన్ యూనిట్ వినియోగం. ఉమ్మడి జిల్లాలో 45 – 46 మిలియన్ల యూనిట్లు
20 లక్షల కనెక్షన్లపై అధిక వత్తిడి.
తరచూ ట్రిప్పు అవుతున్న ఫీడర్లు. వరుసగా కాలిపోతున్న విద్యుత్ మోటర్లు. రైతులపై పెరుగుతున్న మర్మతుల భారం. ఎండుతున్న పంటల్లో రోడ్లు ఎక్కుతున్న రైతులు
రోజుకు 12 గంటలకు మెరుగైన కరెంటు ఇవ్వాలని.
రైతుల ఆందోళన
మంచాల మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు సకాలంలో సాగునీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని, తరచూ ఏర్పడుతున్న అంతరాయాలను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మంచాల గ్రామ కార్యదర్శి దూసరి సత్తయ్య, శాఖ సభ్యులు ఏర్పుల యాదయ్య, చీర కొమురయ్య, ఏర్పుల కృష్ణ, నరసింహ, ఏడుపుల బాలరాజ్, శివకుమార్, రమేష్, వర్గాల ప్రభాకర్, గడ్డం దర్శన్, జంగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు….

