*హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం*
మేడ్చల్, ప్రజావాణి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 297వ మేడ్చల్ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో జై తుల్జా భవానీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
యువ నాయకుడు మారిగల సాయి కుమార్ (బబ్లూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు పాల్గొన్నారు. వారు వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ సందర్భం
గా యువత మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందుతాయని తెలిపారు. సేవా కార్యక్రమాలు ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంచడంతో పాటు అవసరమైన వారికి అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. నవీన్, నిఖిల్, సాయి, విశాల్, శేఖర్, రాహుల్, నాని, రఘు, మణి, హర్ష, చరణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

