📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి – పాలడుగు నాగార్జున

ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి – పాలడుగు నాగార్జున

📰 Generate e-Paper Clip

వ్యవసాయానికి రోజుకు 14 గంటల నాణ్యమైన విద్యుత్ అందించి ఎండుతున్న పంటలను కాపాడాలి

ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి – పాలడుగు నాగార్జున

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఎండుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రోజుకు కనీసం 14 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. చందనపల్లి వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, ఒకవైపు ఎల్‌టినో ప్రభావం, మరోవైపు విద్యుత్ కొరత రోజుకు 7:00 నుండి 9 గంటల వరకు మాత్రమే కరెంటు ఇవ్వడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి నీటిని ఆదా చేసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపి ఉంటే ప్రస్తుతం రైతులకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదన్నారు. వ్యవసాయానికి అవసరమైన మేరకు నాణ్యమైన సరఫరా చేయడం ప్రభుత్వం విఫలమైందని విద్యుత్తు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్న రైతుల మోటార్లు కాలిాయని మరియు మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. క్రాప్ హాలిడే ప్రకటించడం పరిష్కారం కాదని, పంటల సాగుకు అవసరమైన నీరు, విద్యుత్ అందించి వ్యవసాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావం తెలంగాణలో రైతులు పంటలు సాగు చేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలో నిదర్శనమన్నారు. రైతుల డిమాండ్లు: వ్యవసాయానికి రోజుకు కనీసం 14 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు లేకుండా నిరంతర సరఫరా చేయాలి. కాలిపోయిన, ఎండిపోయిన పంటలను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటిని ఉంచి సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేయాలి. విద్యుత్ కోతల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రత్యేక పరిహారం ప్యాకేజీ ప్రకటించాలి. వ్యవసాయ విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రైతులపై పంట హాలిడే భారాన్ని మోపకుండా పంటల సాగుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ నీటి వనరులు, సాగునీటి ప్రణాళిక అమలు చేయాలి. రైతులకు విత్తనాలు, పంట రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతుల రుణాలు ఈ సంవత్సరం ఆపి ఒప్పందాలు. రైతుల ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రైతులతో కలిసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పాలడుగు నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు కొల్లు రవీందర్, గ్రామ కార్యదర్శి గంగుల యాదయ్య, మాజీ ఎంపీటీసీ రూపొని లింగయ్య, నాయకులు పాలడుగు వెంకన్న, పాలడుగు ఎల్లయ్య, పాలడుగు సైదులు, కొడదల రాములు, చందనపల్లి శంకర్, కొంచెం శీను, పాలడుగు సాయిలు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.