*గణేష్ మండపాల్లో పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్…*
*ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25*
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం లోని పలు వినాయక మండపాలతో పాటు వంగపల్లి గ్రామంలోని పలు వినాయక మండపా లను ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథు డికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి , ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు, భక్తులతో కలిసి గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో , ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, యువత , నిర్వాహకులు సమన్వయంతో వ్యవ హరించాలని బీర్ల ఐలయ్య సూచించారు

