📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialమంచిర్యాలలో ఘనంగా గణనాధుని శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు

మంచిర్యాలలో ఘనంగా గణనాధుని శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు

📰 Generate e-Paper Clip

*మంచిర్యాలలో ఘనంగా గణనాధుని శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు*

*నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు*

* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన గత పదకొండు రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి అంగరంగ వైభవంగా బయలుదేరి వెళ్లారు. పట్టణంలో ప్రతిష్టించిన గణనాధులను అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించి, అనంతరం గణేశుని సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. వినాయక మండలిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథులను బాజాభజంత్రీలు, కోలాటాలతో నృత్యాలు చేస్తూ, శోభాయమానంగా శోభయాత్ర నిర్వహించి, నిమజ్జనానికి తరలించారు. అంతకుముందు గత పదకొండు రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథునికి ఆయా ఆయా గణేష్ మండలీల ఆధ్వర్యంలో నిమజ్జనాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, హెూమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండప కమిటీల ఆధ్వర్యంలో మండపాల వద్ద నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని చేతిలోని లడ్డు, కలశం, వివిధ రకాల పూజా వస్తువులు వేలంపాట నిర్వహించగా, వాటిని సొంతం చేసుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు. ఆయా మండపాల ఆవరణలో పోటా పోటీ వేలం పాటలతో నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు ప్రసాదాలను భక్తులు దక్కించుకున్నారు. అనంతరం ఆయా మండపాలలో ప్రతిష్టించిన గణనాధులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో గణనాధులను శోభాయాత్ర నిర్వహించగా, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ, కోలాటాలతో సంప్రదాయ బద్దంగా నిమజ్జనానికి తరలించారు. గణనాధుని శోభాయాత్ర సందర్భంగా చిన్నారులు, యువకులు, మహిళలు ఆనందంగా నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారుల, యువకుల, మహిళల నృత్యాలు, కోలాటాలతో వాడవాడలా సందడి నెలకొంది.

*గణపతి నిమజ్జన శోభయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు*

జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్ర ఉత్సవాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి, గణపతి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొని, నేడు నిమజ్జన కార్యక్రమాన్ని సైతం భక్తి భావంతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ, నియమ నిష్ఠలతో, పరస్పర సహకారంతో ప్రశాంతంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. ఈసారి గోదావరిఖని సమీపంలోని గోదావరిలో కాకుండా గూడెం గోదావరిలో గణపతి విగ్రహాల నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గూడెం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారన్నారు.వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండ సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, పలు రాజకీయ, ప్రజా, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.