ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి,
అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలలకు సెలవు.
కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు* ఫోన్ నెంబర్- 7995074803
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్ జిల్లాలో
వాతావరణ సూచనల నేపథ్యంలో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు, రేపు అనగా సెప్టెంబర్ 24, గురువారం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని, జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, చెరువులు, జలాశయాలు, రోడ్లు, పాత భవనాలు, తదితర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విషయ సూచికలు ఏర్పాటు చేయాలని, అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రాకూడదని, విహారయాత్రలు, జలాశయాలు చెరువులు చేపల వేటకు వద్దకు వెళ్లకూడదని, సూచించారు.
వర్షాలు, వరదలు వల్ల అత్యవసర సహాయం నిమిత్తం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఏదైనా అవసరం ఉంటే తక్షణమే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు,
పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, సంబంధిత అన్ని విభాగాల సిబ్బంది అప్రమత్తంగా సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడిన ఎదుర్కొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఉద్యోగులు ప్రధాన కార్య స్థానంలోనే ఉండాలని, జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురిసి, వరదలు, వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా, వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా, విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ తెలిపారు.

