*45 ఏళ్లుగా భక్తి సేవ.. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ*
మేడ్చల్, సెప్టెంబర్ 23: మేడ్చల్ 297 డివిజన్ పరిధిలోని పాత గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ వినాయక మండపంలో బుధవారం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా యూత్ సభ్యు
లు మాట్లాడుతూ.. గత 45 సంవత్సరాలుగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మేడ్చల్లో వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*45 ఏళ్లుగా భక్తి సేవ.. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ*
RELATED ARTICLES

