తల్లులు చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్
మద్దూరు సెప్టెంబర్ 23, ప్రజా వాణి,
మండలంలోని మర్మాముల గ్రామంలో సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఏ ఎన్ ఏం రేఖ టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వర్ష కాలం సీజన్ లో చిన్నారులకు తప్పకుండా తల్లులు టీకాలు వేయించాలని కోరారు. అందుకోసం వైద్య సిబ్బంది ఎల్లవేళల అందుబాటులో ఉంటారని తెలిపారు.ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఎప్పటికప్పుడు వైద్య సేవలు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బస్వరాజు అశోక్, ఆశా కార్యకర్తలు, చిన్నారుల తల్లులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

