📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - మాజిద్ అఫ్సర్

విద్యా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – మాజిద్ అఫ్సర్

📰 Generate e-Paper Clip

*విద్యా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – మాజిద్ అఫ్సర్*

*జనగామ డీసీసీ మైనారిటీ ఛైర్మెన్*

*జనగామ మైనారిటీ పాఠశాల, కళాశాల గురుకులాలను సందర్శించి విద్యార్థుల విద్యా పరిస్థితులు, మౌలిక వసతులు మరియు సమస్యలను తెలుసుకున్నారు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజావాణి):
జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను జనగామ డీసీసీ మైనారిటీ ఛైర్మన్ మాజిద్ అఫ్సర్ ఆధ్వర్యంలో, పట్టణ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ షరీఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న వసతులు, విద్యా ప్రమాణాలను వారు పరిశీలించగా, పాఠశాల ప్రిన్సిపల్ కుమారస్వామి, కళాశాల కరెస్పాండెంట్ అనిల్ తదితర అధ్యాపక బృందం వారికి శాలువాలు కప్పి, బొకేలతో ఘనస్వాగతం పలికారు, పాఠశాల పరిసరాల్లో వీధి దీపాలు వెలగకపోవడం వల్ల విద్యార్థుల భద్రతకు కలుగుతున్న ఇబ్బందిని గుర్తించిన మాజిద్ అఫ్సర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ మరియు డీఎండబ్ల్యూ (DMW) అధికారులకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేస మస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు,

ఈ సందర్బంగా మాజిద్ అఫ్సర్ మాట్లాడుతూ విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే ఈ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో మైనారిటీ పాఠశాలలను సందర్శించి, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నిత్యం పౌష్టికాహారం (ప్రొటీన్ బేస్డ్ ఫుడ్) అందేలా మెనూను పద్ధతిగా అమలు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, ఎంపీసీ (MPC) మరియు బైపీసీ (BPC) ఫ్యాకల్టీలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉత్తమ సిబ్బందిని కేటాయించి మెరుగైన విద్యను అందిస్తున్నామని చెప్పారు.
క్యాటరింగ్ ఛార్జీలు పెంచడం మరియు బిల్లులు త్వరగా విడుదలయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో భోజన వసతి, నాణ్యత మరింత మెరుగయ్యాయని వెల్లడించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఆరోగ్యకరమైన, ఉత్సాహభరితమైన వాతావరణంలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మైనారిటీ విద్యార్థులతో పాటు నాన్-మైనారిటీ విద్యార్థులకు కూడా 25 శాతం ప్రవేశాలు కల్పిస్తున్నామని, ఇది మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని వారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ గురుకులాలు బలమైన పునాది వేస్తున్నాయని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు, అలాగే మైనారిటీ కళాశాల విద్యార్థులు ఇండియన్ ఆర్మీకు ఎంపికై దేశ స్థాయి లో ప్రతిభ కనబడుచడంతో సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.