📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, బహుమతుల పంపిణీ

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, బహుమతుల పంపిణీ

📰 Generate e-Paper Clip

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, బహుమతుల పంపిణీ

మాజీ ఎంపీటీసీ ఆడడావుత్ వాలి హాంజీ

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం సెప్టెంబర్ 23

దామరచర్ల మండలం జైత్రం తండాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, అలాగే ఆటపాటల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జైత్రం తండా మరియు జాలాబాయి తండాలలోని యువతకు మాజీ ఎంపీటీసీ ఆడడావుత్ వాలి హాంజీ నాయక్ సౌజన్యంతో ఈ టీ-షర్ట్లు, బహుమతులను అందజేశారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించుకోవాలని, ఇటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని అన్నారు.
​ఈ కార్యక్రమంలో సక్రి మంగ్తా నాయక్, తండా యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.