ప్రజాసేవ చేయడమే న్యాయవ్యవస్థ యొక్క లక్ష్యం.
పేదప్రజల కోసం ఉచిత న్యాయ సలహాలు.
హనుమకొండ సీనియర్ సివిల్ జడ్జి హైమా పూజిత.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
న్యాయవ్యవస్థ ప్రజల వద్దకే వస్తుందని హనుమకొండ సీనియర్ సివిల్ జడ్జి జిల్లా లీగల్ సెల్ అథారిటీ నేరెళ్ల వెంకట హైమా పూజిత అన్నారు మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచు మునిగడప లావణ్య ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు ఆమె ప్రజలతో మాట్లాడుతూ పేదవారికి ఉచితంగా న్యాయం అందించడానికి ప్రజల వద్దకు వచ్చినట్లు తెలిపారు అందరికీ చట్టం న్యాయం గురించి తెలియకపోవచ్చు అందుకే ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు గ్రామాలలో రైతు సమస్యలు బోలెడు ఉంటాయని అందరికీ చట్టం గురించి తెలియకపోవచ్చు అన్నారు భూమి కొనుగోలు చేసినప్పుడు దాన్ని సర్వే చేసి ఈసి తీసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలన్నారు. అలాగే తొందరపాటుతనంతో కొనుగోలు చేసి ఇబ్బందుల పడవద్దు అన్నారు చిన్నపిల్లలను మంచిగా చదివించాలని తెలిసి తెలియక ఎవరైనా పనిలో పెట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు అదేవిధంగా. గ్రామాలలో 18 నిండకముందే ఆడపిల్లలకు పెళ్లి చేస్తే తమకు తెలపాలన్నారు ఆడపిల్లలకు 18 మగవారికి 21 నిండిన తర్వాతనే పెళ్లి చేయాలని పలికారు. అలా ఎవరైనా చేస్తే 1098 కి కాల్ చేయాలన్నారు.అదేవిధంగా గుర్తుతెలియని వ్యక్తులకు ఓటిపి చెప్పకూడదు ఆ విధంగా తెలిసి తెలియక చేసిన తప్పుల వలన ఓటీపీ చెప్పి డబ్బులు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అడ్వైజర్ రవికుమార్ మాట్లాడుతూ గతంలో న్యాయం కోసం జిల్లా కేంద్రంలోని కోర్టులకు తిరిగి ప్రజలు ఇబ్బందులు పడి వెళ్లే వారన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రజల వద్దకు న్యాయవ్యవస్థ రూపొందించి మొబైల్ కోర్టు ఫలితం ఏర్పాటు చేసిందన్నారు త్వరలోనే అన్ని జిల్లాలకు మండల కేంద్రాలకు మొబైల్ కోర్టులు వస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ విజయ్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ రమేష్, ఉపసర్పంచి రాజు, టైపిస్టు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

