*నిరుపేదలకు CMRF చెక్కుల పంపిణీ*
జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 22(ప్రజావాణి):
జనగామ మండలంలోని శామీర్ పేట, పెద్దారంచెర్ల గ్రామాలకు చెందిన నిరుపేదలకు రూ. 2,20,000 విలువైన CMRF చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేశారు. అలాగే కట్కూరు గ్రామానికి చెందిన నిరుపేద కుర్మ సామాజిక వర్గ కుటుంబానికి రూ. 60,000 CMRF చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సహాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు బల్ల రవీందర్, గనిపాక వనిత మహేందర్, డీసీసీ ఉపాధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగరావు, దూడల సిద్ధయ్య గౌడ్, కొడవటూర్ ఆలయ కమిటీ సభ్యుడు పుట్ట నర్సిములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిరంజీవి, వార్డు మెంబర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

