📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetసైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దాచారం గ్రామంలో పోలీస్ కళాబృందంచే గ్రామ ప్రజలకు అవగాహన

బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాచారం గ్రామంలో మంగళవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు పాటలు, ప్రదర్శనల ద్వారా పలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ
అసాంఘికకార్యకలాపాలకు దూరంగాఉండాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని అవగాహన కల్పించారు.అలాగే మహిళలు,బాలల భద్రత, రోడ్డు భద్రత,సామాజిక బాధ్యత తదితర అంశాలపై ప్రజలకు వివరించారు.
ప్రజల భద్రత,సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి, గ్రామ సర్పంచ్ భైర మానస రాజేందర్, పోలీసులు యాదగిరి, కిరణ్, పోలీస్ కళాబృందం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.