📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalనర్సంపేట పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో మాదన్నపేట జిపిఓ నరసింహస్వామిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి...

నర్సంపేట పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో మాదన్నపేట జిపిఓ నరసింహస్వామిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి కోర్టుకు తరలింపు

📰 Generate e-Paper Clip

నర్సంపేట పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో మాదన్నపేట జిపిఓ నరసింహస్వామిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి కోర్టుకు తరలింపు.

చెన్నారావుపేటలో తీవ్ర కలకలం!

జిపిఓ నరసింహస్వామిని కఠినంగా శిక్షించాలి బాధితుడు రాజు ఆవేదన

​చెన్నారావుపేట సెప్టెంబర్ 21 ప్రజావాణి

 

ప్రస్తుతం నర్సంపేట రెవెన్యూ కార్యాలయంలో మాదన్నపేట జిపిఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెన్నారావుపేట గ్రామానికి చెందిన చెలుకలపెల్లి నరసింహస్వామిపై నర్సంపేట అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.గతంలో నమోదైన ఐపీసీ 447, 427, కేసుల్లో న్యాయస్థానానికి హాజరుకాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో నిందితుడైన జిపిఓ నరసింహస్వామిపై Section 70 Cr.P.C ప్రకారం నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని చెన్నారావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు సోమవారం చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి సిబ్బందితో కలిసి నరసింహస్వామిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నన్ను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించాడు.. కఠినంగా శిక్షించాలి..బాధితుడు రాజు ఆవేదన


ఈ సందర్భంగా బాధిత వ్యక్తి రాజు మాట్లాడుతూ..న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. నరసింహస్వామి నా భూములపై, కుటుంబంపై పలుమార్లు దాడులకు పాల్పడ్డాడు. నా పంటకు పలుమార్లు గడ్డి మందు పిచికారి చేసి పంటను చంపి నాశనం చేసి తీవ్ర మనోవేదనకు గురిచేశాడు. అతని వేధింపులు తాళలేక గతంలో నేను ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలయ్యాను. ఇప్పటికైనా గౌరవ న్యాయస్థానం స్పందించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి నాకు న్యాయం చేయాలని కోరారు. i8

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.