సాలకపూర్ గ్రామ అభివృద్ధికి నిరంతర కృషి
గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్
గ్రామ పాఠశాల ప్రహరీ గోడకు భూమిపూజ
మద్దూరు సెప్టెంబర్ 21, ప్రజా వాణి,
మండలంలోని సలాకపురం గ్రామంలోనీ పాఠశాల ప్రహరీ గోడకు గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ నిధులనుండి ఆరు లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీ గోడకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్.చెట్టే ఐలయ్య, మాజీ సర్పంచ్ వంగ బాల్ రెడ్డి, వార్డు సభ్యులు గడిపే నిర్మల వగలబోయిన ప్రసాద్, చెట్టుకూరి రాజు,కడకంచి యాదగిరి,చెట్టే చంద్రవ్వ,పాఠశాల హెచ్ఎం రేష్మ,ఉపాధ్యాయుడు చంద్రయ్య,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ చామంతుల దేవేంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

