📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడీజే మోతలు వద్దు… భక్తి మార్గంలో వినాయక నిమజ్జనం ముద్దు

డీజే మోతలు వద్దు… భక్తి మార్గంలో వినాయక నిమజ్జనం ముద్దు

📰 Generate e-Paper Clip

డీజే మోతలు వద్దు… భక్తి మార్గంలో వినాయక నిమజ్జనం ముద్దు

— భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్

ఘనంగా స్నేహ పబ్లిక్ స్కూల్ లో వినాయక నిమజ్జనం

భిక్కనూర్ సెప్టెంబర్ 20 (ప్రజావాణి):

భిక్కనూర్ పట్టణ కేంద్రంలో గల స్థానిక స్నేహ పబ్లిక్ స్కూల్ నందు వినాయక నిమజ్జన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై అనిల్ కుమార్ హాజరై వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ యువత వినాయక పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మరియు అధిక శబ్దంతో నడిచే డీజే లకు దూరంగా ఉంటూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కార్యక్రమాలు చేయకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆయన అన్నారు .

మరియు పాఠశాల కరస్పాండెంట్ ఎండి సలీం మాట్లాడుతూ స్నేహ పబ్లిక్ స్కూల్ నందు వినాయక పండగను పురస్కరించుకొని ఏడు రోజులు విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన వినాయక నిమర్జనం కార్యక్రమానికి విచ్చేసిన భిక్నూర్ ఎస్సై అనిల్ కుమార్ మరియు భిక్నూర్ వార్డ్ మెంబర్స్ కర్రోళ్ల రాజు, గజ్జే వేణు శాల్వాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు మరియు భిక్కనూరు పట్టణ ప్రజా ప్రతినిధులు మరియు ప్రవీణ్ కుమార్ లింగాల మోహన్ గౌడ్ న్యాయవాది నాగరాజు రవి ఉపాధ్యాయ బృందం భి క్కనూరు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.