కోదాడలో మెగా జాబ్ మేళా ఘన విజయం..
కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృతజ్ఞతలు..
కోదాడ, సెప్టెంబర్ 20/ ప్రజావాణి స్థానిక సి.సి. రెడ్డి కాన్వెంట్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా అద్భుతంగా విజయవంతం కావడం పట్ల కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రతి ఒక్కరికీ ఆమె పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ మెగా జాబ్ మేళా విజయవంతం కావడంలో పార్టీ శ్రేణుల పాత్ర మరవరానిదన్నారు. జిల్లా, బ్లాక్, మండల, పట్టణ, గ్రామ మరియు వార్డు స్థాయి అధ్యక్షులు, ఆయా కమిటీల బాధ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.అలాగే పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా, యూత్, ఎన్.ఎస్.యు.ఐ కమిటీల బాధ్యులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, శ్రేయోభిలాషులు మరియు మిత్రులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేశారని, వారందరికీ తన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

