📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆరుట్లలో నిషేధిత కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్రత్యక్షం

ఆరుట్లలో నిషేధిత కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్రత్యక్షం

📰 Generate e-Paper Clip

*ఆరుట్లలో నిషేధిత కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్రత్యక్షం*

*పరిశీలించిన ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్*

*సంబంధిత కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్*

రంగారెడ్డి జిల్లా మంచాల: సెప్టెంబర్ 20. (ప్రజావాణి) మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారి పక్కన ఉన్న పడమటి చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తులు పరావెసిన నిషేధిత కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ కుప్పలుగా పడి ఉన్న బాటిళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కంబాలపల్లి భాస్కర్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలో చిన్న కూల్‌డ్రింక్ బాటిళ్లను అక్కడ పడవేశారని తెలిపారు. బాటిళ్లపై ప్రభుత్వ అనుమతి లేదా ఆమోదానికి సంబంధించిన స్పష్టమైన గుర్తులు కనిపించడం లేదని పేర్కొన్నారు. బాటిళ్లపై ఉన్న వివరాలను పరిశీలిస్తే అవి పంజాబ్ రాష్ట్రంలో తయారైనట్లు తెలుస్తోందని అన్నారు.

ఇలాంటి అనుమానాస్పద కూల్‌డ్రింక్ బాటిళ్లను ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు వినియోగిస్తే ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగే అవకాశం ఉందని భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత గ్రామ సిబ్బంది, పోలీసు శాఖ, ఇతర ప్రభుత్వ అధికారులు స్పందించి బాటిళ్లను అక్కడి నుంచి తొలగించాలని కోరారు.

అలాగే బాటిళ్లను అక్కడ పడవేసిన వ్యక్తులను గుర్తించి, వాటి తయారీ సంస్థకు సంబంధించిన వివరాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత సంస్థపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఇటువంటి ఉత్పత్తుల విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కొండిగ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.