📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన

ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన

జిల్లా వ్యాప్తంగా 2,250 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు – స్క్రీనింగ్ ద్వారా 500 మంది అభ్యర్థుల ఎంపిక ..

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రానున్న ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు 2,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థుల్లో 500 మందిని ఎంపిక చేసి, నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ లో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని క్రమశిక్షణతో శిక్షణకు హాజరై, పట్టుదలతో చదివి, శారీరక దృఢత్వంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షతో పాటు సబ్జెక్ట్ నిపుణులతో బోధన, పరీక్షల విధానం, మోడల్ టెస్టులు, సందేహాల నివృత్తి, శారీరక దారుఢ్యానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంపికైన 500 మంది అభ్యర్థులు పట్టుదలతో శ్రమించి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.