దళిత జర్నలిస్ట్ ఫోరమ్ 11వ రాష్ట్ర సభలను విజయవంతం చేద్దాం
సంక్షేమ పథకాల్లో దళిత జర్నలిస్ట్ లకు ప్రాధాన్యం ఇవ్వాలి
అక్టోబర్ 7న చలో సంగారెడ్డి
మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి,
సిద్ధిపేట జిల్లా జర్నలిస్ట్ నాయకులు పాకాల జాకబ్
మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి,
అక్టోబర్ 7న సంగారెడ్డి పట్టణంలోని ఫంక్షన్ హాల్లో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే 11వ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేద్దాం అని సిద్దిపేట జిల్లా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ నాయకులు పాకాల జాకబ్ అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని దళిత జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. గత 11ఏళ్లుగా దళిత జర్నలిస్ట్ ల హక్కుల కోసం వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న దళిత జర్నలిస్ట్ ఫోరమ్ జాతీయ అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ఎల్లేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

