ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లోని బి1 పార్క్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని యశ్వంత్, శ్రీకర్, భరత్, రవి, పవన్, నితిన్, రోహిత్, చందు, హిమాంశు, సాయిచరణ్, హరీష్, జాయ్, సాయికిరణ్, ఆదిత్య, నబీ తేజ తదితర యువత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బి1 పార్క్ గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యువత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం అన్నదానం నిర్వహించడం ద్వారా సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు
కార్యక్రమంలో బి1 విఘ్నేశ్వరుని మండప నిర్వాహకులు, కాలనీ పెద్దలు పాల్గొని యువతను అభినందించారు. ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యురాలు చందుపట్ల అశ్విని, వంశీ, కనకమహాలక్ష్మి, అంబుజం, సుశీల, కిరణ్, సురేష్‌రావు, మల్లికార్జున్‌రావు, చోకుల, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


