బి1 పార్క్ గణనాథుడి సన్నిధిలో యువత సేవా కార్యక్రమం
ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లోని బి1 పార్క్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని యశ్వంత్, శ్రీకర్, భరత్, రవి, పవన్, నితిన్, రోహిత్, చందు, హిమాంశు, సాయిచరణ్, హరీష్, జాయ్, సాయికిరణ్, ఆదిత్య, నబీ తేజ తదితర యువత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బి1 పార్క్ గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యువత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం అన్నదానం నిర్వహించడం...