📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

స్మైల్ ఫౌండేషన్ సహకారంతో యూనివర్సల్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ–

జవహర్‌నగర్: సెప్టెంబర్ 19( ప్రజావాణి ప్రతినిధి )

ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని జవహర్‌నగర్ డివిజన్‌లో ఈ నెల 19న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. స్మైల్ ఫౌండేషన్ సహకారంతో యూనివర్సల్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేఆర్ నగర్ మామిడి తోటలో ఉదయం 10.30 గంటలకు శిబిరం ప్రారంభం జరిగింది.

ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, చిన్నారుల వైద్య నిపుణులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. సాధారణ అనారోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, చిన్నారుల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ శిబిరం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

శిబిరం విజయవంతానికి జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు సమయానికి హాజరై సహకరించాలని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమ ఏర్పాట్లలో యూనివర్సల్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొలిపాక సాయికిరణ్, కొలిపాక కళ్యాణి పాల్గొని శిబిర నిర్వహణకు అవసరమైన సమన్వయం చేస్తున్నారు.

శిబిరంలో స్మైల్ ఫౌండేషన్ సీహెచ్‌ఓ ఎండీ సాదిక్‌తో పాటు వైద్యులు గడ్డం రాజకుమార్, జె. గౌతమీ, మెడ శిరీష, స్టాఫ్ నర్సులు సంధ్యారాణి, సిమియా, మానస రాజశేఖర్, పవిత్ర తదితరులు సేవలు అందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.