📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్13 గంటలు పాటు గడ్డలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తి ..

13 గంటలు పాటు గడ్డలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తి ..

📰 Generate e-Paper Clip

13 గంటలు పాటు గడ్డలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తి ..

కాపాడిన స్థానికులు పోలీస్లు, ఫైర్ అధికారులు

పలాస ప్రజావాణి ప్రతినిధి

పలాస మండలం గరుడకండి గ్రామ సమీపంలో ఉన్న సవర గెడ్డలో ప్రమాదవశాత్తు నీటిలో పడి గుర్రపు డెక్కలో సుమారు 13 గంటలు చిక్కుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తిని కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఫైర్ సిబ్బంది స్థానికులు కృష్ణంరాజు, తులసిరావు, సీతారాం,గ్రామస్తులు అంతా కాపాడి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ ఎస్ఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెస్క్యూలో పాల్గొనందుకు స్థానికులు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మతిస్థిమితం లేకుండా ఊరూరు తిరుగుతూ గరుడకండి సమీపంలో ఉన్న గడ్డలో మునిగి గుర్రపుడేక్కలతో మధ్య గురువారం సాయంత్రం చిక్కుకుపోయినట్టు తెలుస్తుందని శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఆయనను గుర్తించి పోలీస్, అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించడంతో ఆయనను వాగులో నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో తరలించమని ఆయన వివరాలు తెలియ రాలేదని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.