📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyదళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 19
(జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

జోగిపేట: దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం అందోల్ మండలం జోగిపేట పట్టణంలో అధికారులు ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మార్వో సాగర్ మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్థానిక ఏస్ ఐ గిరి శ్రీకాంత్ చేతుల మీదుగా గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు దానం మెహన్ మాట్లాడుతూ, అక్టోబర్ 7న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు, జిల్లా సభ్యుడు మాదిగ బుచ్చయ్య, అజ్జిగళ్ల నర్సింలు, కుసంగి మహేష్, మేకల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.