అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించం
* కలిపిత నాయకుడు అంబేద్కర్ పుస్తక విడుదలను అడ్డుకోవాలి శాశ్వతoగ ఇలాంటి ఆలోచన ని వెనుకకు తీసుకోవాలి
* రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్
జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
డా. బి.ఆర్. అంబేద్కర్ ని విమర్శిస్తూ కలిపిత నాయకుడు అంబేద్కర్ పేరుతో పుస్తకాన్ని ఈ నెల 18వ తేదీన (అనగా ఆర్ ఇ పి యు)విడుదల చేయనున్న హమారా ప్రసాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జ్ఞానం ఆలోచనలు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన కృషికి లభిస్తుంటే మన దేశంలోనే ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని భారతదేశంలోని అన్ని వర్గాలు కులాలు మతాలకు చెందిన ప్రజల హక్కులు స్వేచ్ఛ సమానత్వం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని ప్రశాంత్ పేర్కొన్నారు.అంబేద్కర్ గురించి విమర్శలు చేసే వారు ముందుగా ఆయన రచనలు ఆలోచనలు భారత రాజ్యాంగాన్ని చదవాలని సూచించారు. ఆధారాలు లేని లేదా అవమానకరమైన పుస్తకాలను కొనుగోలు చేసి చదవడం కంటే, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ పుస్తకాన్ని కొనుగోలు చేసి చదివి తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారుఅంబేద్కర్ గౌరవానికి భంగం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం చట్టపరంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పుల్లూరి ప్రశాంత్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరారు

