*అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం, అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలు*
రాయికల్; సెప్టెంబర్ 17(ప్రజావాణి)
రాయికల్ మండలంలోని ధర్మాజీపేట గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ మాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పోషణ మాసంలో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన,అక్షరాభ్యాస కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి విచ్చేసిన అతిథులు చిన్నారులకు అన్నం తినిపించి, పలకలపై అక్షరాలు దిద్దించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు,చిన్నారుల తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం, ఆకుకూరలు,పండ్లు,పాల ఉత్పత్తులు తీసుకోవాలని, రక్తహీనత నివారణకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలని,పరిశుభ్రత, టీకాల ఆవశ్యకతపై ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాకిటి గంగారెడ్డి, ఉప సర్పంచ్ కాయితి సంజీవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తోపారం రాజేందర్,అంగన్వాడీ టీచర్లు ప్రమీల,అనురాధ,ఆశా కార్యకర్తలు,తల్లులు, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

