అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం, అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలు
*అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం, అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలు* రాయికల్; సెప్టెంబర్ 17(ప్రజావాణి) రాయికల్ మండలంలోని ధర్మాజీపేట గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ మాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పోషణ మాసంలో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన,అక్షరాభ్యాస కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి విచ్చేసిన అతిథులు చిన్నారులకు అన్నం తినిపించి, పలకలపై అక్షరాలు దిద్దించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు,చిన్నారుల తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం, ఆకుకూరలు,పండ్లు,పాల...