📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్దళిత సంఘాల ధర్నా

దళిత సంఘాల ధర్నా

📰 Generate e-Paper Clip

•ఎలుకటి రాజయ్య

•మారపెల్లి మల్లేష్

టేకుమట్ల/ప్రజావాణి: బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించే విధంగా రచనలు చెయ్యడం జాతిని అవమానించడమే అని దళిత ద్రోహి హమారా ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా దళిత ప్రజా సంఘాల నాయకులు ఎలుకటి రాజయ్య, మారాపెల్లి మల్లేష్ మాట్లాడుతూ హమారా ప్రసాద్ అనే దళిత ద్రోహి బీజేపీ మతోన్మాద శక్తులతో చేతులు కలిపి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అవమానించే విధంగా కల్పిత నాయకుడు అని రచనలు చేయడం దళిత జాతిని అవమానించడమే అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే దేశంలో స్వేచ్చ తో హమారా ప్రసాద్ లాంటి దేశ ద్రోహులు విచ్చలవిడిగా మాట్లాడుతూ, రాజ్యాంగం రచించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు స్పందించి ఇలాంటి వాఖ్యలు చేస్తున్న హామర్ ప్రసాద్ లాంటి వ్యక్తులను గుర్తించి వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు దాసారపు. భాస్కర్,మారపెల్లి రాజకొమురయ్య, అంబాల రమేష్,రాజయ్య, అంబాల అశ్వథామ,మారపెల్లి. కొమురయ్య,బొజ్జపెల్లి ప్రభాకర్,ఆకునూరి మధునయ్య,జీడీ సదయ్య బూడిది కొమురయ్య, బొజ్జపెల్లి తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
*రోడ్డు కష్టాలకు చెక్‌.. సీసీ రోడ్డు పనులు ప్రారంభం! *ప్రజల సమస్య విన్న శశిధర్‌రెడ్డి.. అధికారులతో సమన్వయం చేసి సమస్యకు పరిష్కారం అమీన్‌పూర్, సెప్టెంబర్‌ 17 (ప్రజావాణి):అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్‌రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. సీఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్‌ సృజన లక్ష్మీనగర్‌ కాలనీలో రోడ్డు సమస్యకు పరిష్కారం చూపుతూ సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. పనుల పురోగతిని శశిధర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. కొంతకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో రాకపోకలకు మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు శశిధర్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఆయన.. సమస్యను నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజల అవసరాన్ని గుర్తించి అధికారులతో సమన్వయం చేస్తూ సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం.. అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.. పరిష్కారం సాధించే వరకు అనుసరించడం తన విధానమని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో సృజన లక్ష్మీనగర్‌ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పట్టించుకుని పరిష్కారానికి చొరవ చూపిన శశిధర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.