*ప్రధానిమోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపం వెలిగింపు*
*ప్రధానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్ష*
మేడ్చల్ ; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని యెల్లంపేట్ మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ అర్చనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాద దీపం వెలిగించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ సేవలో మరింతకాలం కొనసాగాలని, దేశం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో దీపం వెలిగించి ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.:ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

