*జనగామ డీసీసీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17 (మా సమగ్ర ప్రజా వాణి ): తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం జెండాకు వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో YTDA సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ విలీన దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కమిటీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

