📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిది బిజెపి మండల అధ్యక్షుడు రామకృష్ణ

సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిది బిజెపి మండల అధ్యక్షుడు రామకృష్ణ

📰 Generate e-Paper Clip

సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిది
బిజెపి మండల అధ్యక్షుడు రామకృష్ణ

ప్రజావాణి శాయంపేట:

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని శాయంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నరహరిశెట్టి రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయరాకుల మొగిలి హాజరయ్యారు తను మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైన ఈ చారిత్రక ఘట్టం వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు చేసిన పోరాటం, త్యాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. వారి యొక్క కృషి మరువలేనిదని
తెలంగాణ విమోచన ఉద్యమంలో చాకలి ఐలమ్మ, కొమురం భీమ్‌తో పాటు ఎందరో ఉద్యమకారులు, అమరవీరులు ప్రజల హక్కుల కోసం పోరాడారని మొగిలి గుర్తు చేశారు. వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ నిరంతరం ముందుండి పోరాడుతోందని ఆయన తెలిపారు. దేశ చరిత్రను, విమోచన ఉద్యమంలో పాల్గొన్న వీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడం, యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడం బీజేపీ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
చరిత్రను మరచిపోకుండా.. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాయరాకుల పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పు రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, సీనియర్ నాయకులు బూర ఈశ్వరయ్య, బాసని విద్యాసాగర్,వనం దేవరాజు, మండల కార్యదర్శి మేకల సుమన్, భూత్ అధ్యక్షులు కోడేపాక సంజీవరావు కన్నెబోయిన రమేష్, బాసాని నవీన్, కొంగర సుధాకర్, కుక్కల సతీష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.