📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్

గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్

📰 Generate e-Paper Clip

గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్

కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా
దాహేగాం: మండలంలోని బిబ్రా గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువుదీరిన గణనాథుడిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ దండే విఠల్ ని ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దహేగం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతుగంటి భీమన్న,నాయకులు ఎల్క మోహన్,స్వప్న, కొమరం భీం జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ష వెంకటేష్, దహేగం మండలం యూత్ అధ్యక్షులు సాయి,మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.