ఎన్ జి కళాశాలలో కెరీర్ రెడీనెస్ సన్నధ్ధత
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నాగార్జున ప్రభుత్వ కళాశాల లో మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో, లాంచ్ గర్ల్స్ సంస్థ నిర్వహిస్తున్న కెరీర్ సన్నద్ధత కార్యక్రమంపై మొదటి సంవత్సరం విద్యార్థినులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, విద్యార్థినులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల దశ నుంచే తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకొని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళా సాధికారత సెల్ ఇన్‌చార్జి వి. శిరీష మాట్లాడుతూ, విద్యార్థినులు తమలోని సామర్థ్యాలను గుర్తించడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. లాంచ్ గర్ల్స్ కార్యక్రమ సహాయకురాలు దివ్య మొదటి సంవత్సరం విద్యార్థినులకు కార్యక్రమం యొక్క లక్ష్యాలు, విధానం మరియు ప్రయోజనాలను వివరించారు.
వాస్తవ జీవిత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం, సంభాషణా నైపుణ్యాలు, వ్యూహాత్మక ఆలోచన, ప్రణాళిక, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆర్థిక నిర్వహణ, భవిష్యత్ సన్నద్ధత వంటి అంశాలను ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె.శివరాణి,డా. వెల్దండి శ్రీధర్, ఎన్. కోటయ్య, సావిత్రి, మహేశ్వరి, స్రవంతి, సంధ్య, హస్రత్, నస్రీన్, కవిత, శ్వేత, తులసి, పరశురాణి, రమ్య మరియు ఇతర మహిళా అధ్యాపకురాళ్లు మరియు మొదటి సంవత్సరం విద్యార్థినులు పాల్గొన్నారు.

