రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కీసర, సెప్టెంబర్ 17 (ప్రజావాణి ప్రతినిధి): రేషన్ బియ్యం కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కీసర చెరువు వద్ద రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.
రేషన్ బియ్యం కేసులో నిందితుల నుంచి కొంతకాలంగా లంచం డిమాండ్ చేస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి, కీసర చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా రూ.5 లక్షలు తీసుకుంటున్న ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని పట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏసీబీ అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

