రేషన్ బియ్యం కేసులో లంచం డిమాండ్.. ఎస్సైపై ఏసీబీ దాడులు

రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు కీసర, సెప్టెంబర్ 17 (ప్రజావాణి ప్రతినిధి): రేషన్ బియ్యం కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కీసర చెరువు వద్ద రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. రేషన్ బియ్యం కేసులో నిందితుల నుంచి కొంతకాలంగా లంచం డిమాండ్ చేస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఏసీబీ...