📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూరు మండలంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్

చండూరు మండలంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్

📰 Generate e-Paper Clip

చండూరు మండలంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ – పేద ప్రజలకు అండగా ఉంటానని హామీ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గణనాథుడి కి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ – “గణేష్ ఉత్సవాలు మనందరినీ ఐక్యంగా ఉంచుతాయి. ఈ పండుగ సందర్భంగా పేద ప్రజలకు అండగా ఉండటం మన బాధ్యత. ఇఎల్వీ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడూ పేద ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటాను. చదువు, వైద్యం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వంటి కార్యక్రమాలను నిరంతరం చేస్తూనే ఉంటాను” అని అన్నారు. పేదరికం అనేది శాపం కాదని, కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆయా గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, ఇఎల్వీ ఫౌండేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.