📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్నిమజ్జనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి: చైర్మన్ జాము రవి

నిమజ్జనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి: చైర్మన్ జాము రవి

📰 Generate e-Paper Clip

*నిమజ్జనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి: చైర్మన్ జాము రవి*

మేడ్చల్ ప్రజావాణి:-మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల అధ్యక్షులతో వినాయక నిమజ్జన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. *మున్సిపల్ చైర్మన్ జాము రవి గారి అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ గారి ఆధ్వర్యంలో* ఈ సమావేశం జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ జాము రవి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉద్దేమరి, కొల్తూర్, లక్ష్మాపూర్ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో గులాం ఇంద్రిస్, సీఐ నరసింహారెడ్డి, ఎస్‌హెచ్‌ఓ గురువయ్య తదితర అధికారులతో కలిసి నిమజ్జన మార్గాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై మండపాల అధ్యక్షులతో చర్చించారు. ఈ సమావేశానికి *షామీర్‌పేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరసింహారెడ్డి, జీనోమ్ వ్యాలీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గురువయ్య*, స్థానిక కౌన్సిలర్ *ర్యాకల నీరజ్ గౌడ్*, *గిరిపల్లి రమేష్, మెరుపాటి గోవర్ధన్ రెడ్డి బొమ్మలపల్లి మల్లేష్ యాదవ్*, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు *దోసకాయల వెంకటేష్*, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, బసవ రెడ్డి* తదితరులు హాజరయ్యారు. అలాగే మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ అర్షద్ అహ్మద్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ సింగ్* తదితర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి *వినాయక మండపాల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరై*, నిమజ్జన ఏర్పాట్లపై తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమానికి *మీడియా మిత్రులు కూడా హాజరయ్యారు*.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.