📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్లంబోదర యూత్ అసోసియేషన్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు

లంబోదర యూత్ అసోసియేషన్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

లంబోదర యూత్ అసోసియేషన్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు

 మేడ్చల్: లంబోదర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు కలగాలని రాఘవేందర్ గౌడ్ ఆకాంక్షించారు. యువత ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్ర విజయరావు, కుత్తడి నర్సింగరావు, కుత్తడి శివకుమార్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.